ఈరోజు సింహం, కన్య రాశుల వారికి విశేష లాభాలు..! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...🌟🔮
- Suresh D
- Dec 9, 2023
- 3 min read
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి
మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయి. దూరదృష్టితో వ్యవహరిస్తారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు పనికి రాదు. లౌక్యంగా వ్యవహరిస్తారు. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి. రుణాల విముక్తి పొందడానికి ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తారు. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు నేటి దినఫలాలు మధ్యస్థం. ఆర్థిక స్ధితి అనుకూలంగా ఉంటుంది. నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. నిబద్దత లేని కొన్ని స్కీముల వల్ల నష్టమపోయే సూచనలు ఉన్నాయి. అతిముఖ్యమని భావించే వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరకు మీరు అనుకున్నదే అవుతుంది. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని సూచన. అనుకోకుండా జరిగే పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి జాతకులకు ఈ రోజు మీకు మధ్యస్థ సమయం. సాహిత్య కళా రంగాల పట్ల అభిరుచి కనబరుస్తారు. ఏమాత్రం ఉపయుక్తం లేని అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. గుడ్‌విల్‌ను రుజువు చేసుకోగలుగుతారు. విందు, వినోదాల ద్వారా పరిచయాలు విస్తృతమవుతాయి. ఉమ్మడి కొనుగోళ్ళు లాభించవు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ, ప్రయివేటు పరంగా రావలసిన పెండింగ్ బిల్స్ ఓ కొలిక్కి వస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారపరంగా తీసుకోవలసిన నిర్ణయాలను వ్యూహాత్మకంగా అమలుచేస్తారు. ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు ఆర్థిక వ్యవహారాలు మినహా మిగతా విషయాలు అనుకూలం. ఉన్నతాధికారులతో జరిపే చర్చల వల్ల లాభపడతారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయాలను ఓకొలిక్కి తీసుకువస్తారు. ప్రభుత్వపరమైన లీజులు, లైసెన్సులు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. విలువైన రహస్య సమాచారం తెలుసుకుంటారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి
కన్యారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు మధ్యస్తం నుంచి అనుకూలం. రాజకీయపరమైన వ్యవహారాలు సానుకూలం. వ్యాపారపరంగా స్వల్బ అభివృద్ధిని సాధిస్తారు. న్యాయబద్ధమైన మీ వాదనలకు పదుగురి మద్దతు లభిస్తుంది. ప్రజా సంబంధాలను మరింత మెరుగుపరచుకుంటారు. లిటిగేషన్ వ్యవహారాలు సానుకూలపడతాయి. లీజులు, లైసెన్సులు తిరిగి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
తులా రాశి
తులారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అధికారులతో ముఖాముఖి చర్చలు సాగిస్తారు. నూతనమైన బ్యాంక్ ఖాతాలు ప్రారంభిస్తారు. ప్రయోజనాలను సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనాథాశ్రమాలను సందర్శిస్తారు. అపనిందలకు భయపడకుండా మీరు చేయదలచుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీరు అనుకున్న ప్రణాళికలు అమలుపరచడానికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. పంచాయితీలు, మధ్యవర్తి పరిష్కారాలు, కోర్టు వ్యవహారాలు కాలహరణానికి కారణం అవుతాయి. ఆదాయ, వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. కీలకమైన వ్యవహారాల్లో నిదానించడం చెప్పదగింది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం. రహస్య చర్చల్లో కొత్తవారికి చోటు కల్పించకండి. ఆర్థికపరమైన విషయాలలో మెళకువలు వహించండి. రోటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. అనుకూలమైన ఉత్తర్వుల వలన ప్రత్యక్షంగా పరోక్షంగా గానీ లాభపడతారు. సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకరరాశి జాతకులకు నేటి రాశి ఫలాలు అనుకూలం. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మీ పరపతి పెరుగుతుంది. స్థిరాస్తి విషయంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. మీ సలహాలను పాటించేవారు ఎక్కువగా ఉంటారు. విదేశీ సంబంధమైన విషయాలు విజయవంతమవుతాయి. పెట్టుబడుల విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. ప్రచారంలో ఉన్న నిందలను రూపుమాపుకోవడానికి శ్రీకారం చుడతారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి జాతకులకు నేటి రాశి ఫలాలు మధ్యస్తం. ఉపయుక్తమైన ఖర్చులు ఉంటాయి. క్షుద్ర రాజకీయాలను అధిగమిస్తారు. శత్రువర్గానికి బుద్ధి చెబుతారు. మీ కృషికి తగిన కీర్తి లభిస్తుంది. బదిలీ, ప్రమోషన్ విషయంలో సాంకేతికపరమైన లోపాలు చోటు చేసుకుంటాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో పురోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి మీరు చేసే నూతన యత్నాలు ఫలిస్తాయి. మీ అంచనాలు నిజమవుతాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు వహించండి. మనస్సు విశ్రాంతి కోరుకుంటుంది. అయితే అందుకు పరిస్థితులు అనుకూలించవు. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.