top of page

ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌..

🏏 ఇక ఐసీసీ నామినేట్‌ చేసిన రెండో ఆటగాడు, ఆసీస్‌ స్టార్‌, ఆల్‌ రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్. ప్రపంచకప్‌లో ఆఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇక భారత్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో అతను 207.14 స్ట్రైక్ రేట్‌తో 116 పరుగులు చేశాడు. భారత ఆటగాడు మహ్మద్ షమీని కూడా ఐసీసీ నామినేట్ చేసింది. ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో, అతను కేవలం ఏడు ఇన్నింగ్స్‌లలో 24 వికెట్లు తీసి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై 18 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఈ ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంటారో చూడాలి. 🏏🌟🔥


 
 
bottom of page