సగిలేటి కథ నుంచి చికెన్ సాంగ్ ని చూశారా? భలేగుంది.. చికెన్ కోసం మీసం తాకట్టు పెట్టి..
- Suresh D
- Oct 9, 2023
- 1 min read
తాజాగా సగిలేటి కథ సినిమా నుంచి చికెన్ సాంగ్ రిలీజయింది. ఈ పాట వింటుంటే భలే సరదాగా ఉంది. సినిమాలో ఈ పాట చాలా కీలకం అట. ఇక ఈ ‘చికెన్’ సాంగ్ ని కోడికూర చిట్టిగారే అనే రెస్టారెంట్ లో లాంచ్ చేశారు. రవి మహాదాస్యం విషిక లక్ష్మణ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సగిలేటి కథ ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ కాబోతుంది.