top of page

బాలకృష్ణ 'భగవంత్ కేసరి' నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ విడుదల 🎥🔥

నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపుదిద్దుకుంటున్న భగవంత్ కేసరి చిత్రం నుంచి ట్రైలర్ రిలీజైంది. తెలంగాణ యాసలో బాలకృష్ణ పలికే డైలాగులు హైలైట్ గా నిలుస్తాయి. "ఎత్తిన చెయ్యి ఎవనిదో తెలియాలే, లేచిన నోరెవరిదో తెలియాలే...", "ష్... సప్పుడు జెయ్యాక్" అంటూ బాలయ్య నోటి వెంట డైలాగులు పవర్ ఫుల్ గా వెలువడడం ట్రైలర్ లో చూడొచ్చు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 🎥🔥



 
 
bottom of page