'ఓ మై గాడ్ 2' పై నమ్మకం ఉంచండి..అక్షయ్ కుమార్ 😎
- Suresh D
- Jul 11, 2023
- 1 min read
11 ఏళ్ల తర్వాత ‘ఓ మై గాడ్’ సినిమాకు సీక్వెల్ చేస్తున్న అక్షయ్ కుమార్.. ఇటీవలే అతని ఫస్ట్ లుక్ పై మరింత ఆసక్తిని పెంచేలా అప్ డేట్ ఇచ్చారు. అప్పటికే టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మంచి బూస్టప్ అందించారు.

11 ఏళ్ల తర్వాత ‘ఓ మై గాడ్’ సినిమాకు సీక్వెల్ చేస్తున్న అక్షయ్ కుమార్.. ఇటీవలే అతని ఫస్ట్ లుక్ పై మరింత ఆసక్తిని పెంచేలా అప్ డేట్ ఇచ్చారు. అప్పటికే టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మంచి బూస్టప్ అందించారు. 'ఓఎంజీ2' టీజర్ రిలీజ్ డేట్‍ను ఓ ప్రోమో వీడియోతో అక్షయ్ వెల్లడించాడు. తాను శివుడి వేషంలో ఉన్న ఓ వీడియోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నలుపు రంగు దుస్తులు ధరించి.. పొడవైన జుట్టు, కళ్లకు కాటుక ఇంకా నుదుటిపై నామాలతో అక్షయ్ ఈ వీడియోలో కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేశాడు. శివుడి వేషధారణలో చాలా ఇంటెన్స్‌గా ఈ ప్రోమోలో నడిచాడు అక్షయ్. బ్యాక్‍గ్రౌండ్‍లో 'హర హర మహాదేవ్' నినాదాలు అభిమానుల్ని మరో లోకంలోకి తీసుకెళ్లాయి. ఇక ఈ 'ఓఎంజీ 2' టీజర్‌ను జులై 11వ తేదీన విడుదల చేయనున్నట్టు కూడా అక్షయ్ కుమార్ తెలిపాడు. అయితే, ఈసారైనా ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలని అభిమానులు చిత్రయూనిట్‍ని సూచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే హిందూ నేపథ్యంలో వచ్చిన 'బ్రహ్మస్త్ర', 'ఆదిపురుష్' సినిమాలు పలువురు మనో భావాలు దెబ్బ తీశాయని ఈసారి అలా కావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా రిలీజైన ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చిందని సమాచారం. 😍🎬