Y.S షర్మిలను పరామర్శించిన Y.S విజయమ్మ
- Sudheer Kumar Bitlugu
- Apr 25, 2023
- 1 min read

పోలీసులపై దాడి కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న YSRTP అధినేత్రి షర్మిలను.. Y.S విజయమ్మ పరామర్శించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. లోటస్పాండ్ వద్ద నిన్న పోలీసులపై దాడి కేసులో Y.S షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆమెను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ నాంపల్లి కోర్టులో షర్మిల బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది.