కోల్‌కతా అభిమానులు నాకు ఫేర్‌వెల్ ఇచ్చారు.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Sudheer Kumar Bitlugu
- Apr 24, 2023
- 1 min read

ఐపీఎల్ 2023 తర్వాత రిటైర్మెంట్ విషయమై ధోనీ సంకేతాలు ఇస్తున్నాడు. ధోనీ రిటైర్మెంట్ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మాట్లాడకపోయినప్పటికీ.. మహీ నేరుగా చెప్పకపోయినప్పటికీ.. పరోక్షంగా మాత్రం ఇదే తన చివరి ఐపీఎల్ అని చెబుతున్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనంతరం కెరీర్ చివరి దశలో ఉన్నానంటూ వ్యాఖ్యానించిన ధోనీ.. తాజాగా కోల్‌కతాతో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈడెన్ గార్డెన్స్‌లో నాకు ఫేర్‌వెల్ ఇచ్చేందుకు అభిమానులు ప్రయత్నించారన్నాడు. తద్వారా తనకు ఈడెన్‌గార్డెన్స్‌లో ఇదే చివరి మ్యాచ్ అని ధోనీ చెప్పకనే చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు. తాము అభిమానించే జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఔటైనప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు సైలెంట్ అయిపోతారు. కానీ 19.4వ ఓవర్లో జడేజా ఔటైనప్పుడు మాత్రం ధోనీ బ్యాటింగ్‌కు దిగనున్నాడనే కారణంతో సందడి చేశారు.