ఆదిపురుష్ కోసం ‘అవతార్’ టెక్నాలజీ..
- Sudheer Kumar Bitlugu
- Apr 24, 2023
- 1 min read

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) జంటగా నటించిన మైథలాజికల్ ఎపిక్ ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం నిజానికి ఈ ఏడాది జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఈ మూవీ టీజర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయంటూ విమర్శలు ఎదురయ్యాయి. ఇక కొన్ని హిందూ సంస్థలైతే సీతా రామ లక్ష్మణులతో పాటు రావణాసురుడిని దారుణంగా చూపించారని కేసులు కూడా వేశారు. దీంతో తప్పు తెలుసుకున్న దర్శకుడు మేకర్స్.. ఆదిపురుష్‌కు మెరుగులుదిద్దేందుకు పూనుకున్నారు. మొత్తం మీద జూన్ 16న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.