Heart Attack Factors: గుండెపోటు రావడానికి.. 6 ప్రధాన కారణాలు ఇవే..!
- Sudheer Kumar Bitlugu
- Apr 24, 2023
- 1 min read

Heart Attack Factors: ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా.. గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. మూడు పదుల వయస్సు దాటని
1.Smoking

స్మోకింగ్ చేసేవారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్, పొగాకు, బీడీ పొగలోని రసాయనాలు రక్తాన్ని చిక్కగా చేసి.. సిరలు, ధమనుల లోపల గడ్డలు ఏర్పరుస్తాయి. సిరలు, ధమనుల గడ్డకట్టడం, అడ్డంకలు ఏర్పడటం వల్ల గుండెపోటు, ఆకస్మిక మరణానికి దారి తీస్తుంది
2.high Blood Pressure

హైపర్‌టెన్షన్ కారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని లవ్‌నీత్ బాత్రా అంటున్నారు. అధిక రక్తపోటు .. ధమనుల సాగే గుణం తగ్గిస్తుంది, వాటిని దెబ్బతీస్తుంది. ఇలా గుండెకు ఆక్సిజన్, రక్తం ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటుకు దారితీస్తుంది
3.Diabets

దీర్ఘకాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే.. రక్తనాళాలు, నరాలు దెబ్బతింటాయి. గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకోవడమే కాకుండా ఆక్సిజన్, పోషకాల సరఫరా నెమ్మదిగా జరుగుతుంది. దీని కారణంగా గుండె పనితీరు మందగించి.. గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది.
4.High Cholesterol

మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే.. గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, వెళ్లే ధమనులలో అవరోధం ఏర్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి.. గుండె పోటుకు దారితీస్తుంది.
5.Lack Of physical Activity

డిజిటల్ యుగంలో గంటల గంటలు క్యంపూటర్, ఫోన్ మందు సమయం గడుతున్నారు కానీ.. శారీర శ్రమకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం ఒక్కటే సరిపోదు.. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండటమూ అంతే ముఖ్యం. మీ గూండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం, వాకింగ్, కార్డియో ఎక్స్‌అర్‌సైజ్‌లు చేయండి.
6.Overweight or Obesity

అధిక బరువు గుండెకూ చేటే. బరువు పెరగటం వల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. అధిక బరువు కారణంగా ధమనుల్లో కొవ్వు ప్రదార్థాలు పేరుకుపోతాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దెబ్బతిన్నట్లయితే గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి ఆహార, వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి