“బాయ్స్ హాస్టల్” మూవీ రివ్యూ 🎥🎞️
- Suresh D
- Aug 26, 2023
- 1 min read
ఇక ఈ చిత్రం కథలోకి వస్తే..ఓ బాయ్స్ హాస్టల్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఉండే అజిత్(ప్రజ్వల్) ఓ సూపర్ షార్ట్ ఫిల్మ్ తియ్యాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్ లో తమని టార్చర్ చేసే వారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్(మంజునాథ్ నాయక్) ని తన ఫ్రెండ్స్ కలిసి చంపేసినట్టుగా రాసుకుంటాడు.

ఇక ఈ చిత్రం కథలోకి వస్తే..ఓ బాయ్స్ హాస్టల్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఉండే అజిత్(ప్రజ్వల్) ఓ సూపర్ షార్ట్ ఫిల్మ్ తియ్యాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే తన స్క్రిప్ట్ లో తమని టార్చర్ చేసే వారి హాస్టల్ వార్డెన్ రమేష్ కుమార్(మంజునాథ్ నాయక్) ని తన ఫ్రెండ్స్ కలిసి చంపేసినట్టుగా రాసుకుంటాడు. అయితే ఇంతలో తమ వార్డెన్ నిజంగానే చనిపోయాడు అని తెలియడం, తాను చనిపోయినప్పుడు ఈ అజిత్ అండ్ ఫ్రెండ్స్ పేర్లు రాసి సూసైడ్ నోట్ రాయడం ఊహించని ట్విస్ట్ గా మారుతుంది. మరి అసలు ఆ బాయ్స్ హాస్టల్ లో వార్డెన్ ఎందుకు చనిపోయాడు? అందుకు వాళ్ళే కారణమా లేదా ఇంకో రీజన్ కూడా ఉందా? ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేయలని చూస్తారు? ఈ క్రమంలో వారు పడిన తిప్పలు ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.🎥🎞️
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బాయ్స్ హాస్టల్” చిత్రంలో మెయిన్ గా కనిపించే యంగ్ నటుల పెర్ఫామెన్స్ లు అలాగే మంజునాథ నాయక్ నటన కామెడీ నరేషన్ హైలైట్స్ కాగా కొత్తదనం లేని కథ అక్కడక్కడా సాగదీత సినిమాని డల్ చేసాయి. అయితే యూత్ ని మాత్రం ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఇక హాస్టల్ లైఫ్ ని బాగా దగ్గర నుంచి చూసిన బాయ్స్ కి ఈ హాస్టల్ బాయ్స్ చూస్తే తమని తాము చూసుకున్నట్టు అనిపించవచ్చు. ఒకింత రొటీన్ గానే ఉన్నా నవ్వుకోడానికి అయితే ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు.🎥🎞️