ఎట్టకేలకు హిట్టు కొట్టిన కార్తికేయ.. 🎥🎞️
- Suresh D
- Aug 30, 2023
- 1 min read
'బెదురులంక' సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడంతో హీరో కార్తికేయ ఫుల్ ఖుషీగా ఉన్నాడు . ఎందుకంటే యువ హీరో చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు . 'Rx 100' చిత్రంతో సెన్సేషనల్ హిట్ సాధించిన తర్వాత అతనికి మరో విజయం దక్కలేదు .

'బెదురులంక' సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడంతో హీరో కార్తికేయ ఫుల్ ఖుషీగా ఉన్నాడు . ఎందుకంటే యువ హీరో చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు . 'Rx 100' చిత్రంతో సెన్సేషనల్ హిట్ సాధించిన తర్వాత అతనికి మరో విజయం దక్కలేదు . పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసినా, ఆశించిన హిట్టు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ హిట్ దక్కడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు . ప్రస్తుతం 'బెదురులంక' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కార్తికేయ.. ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేసారు . ''సాన్నాళ్లకి సెవిన పడ్డ మాట.. బ్లాక్ బస్టర్!! 'బెదురులంక 2012' చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు . మీ అందరి ప్రేమకు సపోర్ట్ కు చాలా కృతజ్ఞతలు'' అని ట్వీట్ చేసారు . ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. లాంగ్ రన్ లో ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి. 🎥🎞️











































