గవర్నమెంటు కంటే ముందే జాగ్రత్తపడ్డ అక్షయ్ కుమార్🎬🌟
- balaparasuram
- Sep 8, 2023
- 1 min read
🇮🇳ఇండియాను... భారత్ గా మార్చనున్నట్లు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. 🌍 ఇదిలా ఉంటే.. దేశం పేరు మారకముందే బాలీవుడ్ లో స్టార్ హీరో ముందే జాగ్రత్త పడ్డాడు.

తన సినిమా పేరును మార్చుకుని నెట్టింట వైరల్ గా మారాడు. 📽️ ఆ సినిమా ఏంటి.. దాని వివరాలు ఈ స్టోరీలో తెసుకుందాం.🎥 బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చాలా రోజుల తర్వాత ఓ మై గాడ్ చిత్రంతో హిట్ కొట్టాడు. 🌟 ఇక ఇప్పుడు మిషన్ రాణీ గంజ్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. 🚁 దీనికి మొదట్లో "ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ" అనే ట్యాగ్ లైన్ ఉండేది. 🇮🇳 కానీ దానిని తాజాగా గ్రేట్ భారత్ రెస్క్యూగా మార్చింది మూవీ టీమ్. 📺 ఇండియా పేరును భారత్ గా మార్చడం వల్లే ఈ సినిమా పేరు మారిందని అంటున్నారు. 🎬 అక్షయ్ కుమార్ మిషన్ రాణీగంజ్ మూవీలో 1989లో ఓ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడంలో కీలకపాత్ర పోషించిన జశ్వంత్ సింగ్ గిల్ వీరత్వంపై చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో లీడ్ క్యారెక్టర్ ను అక్షయ్ కుమార్ చేస్తున్నాడు. ఈ పేరు మార్పుకు దేశం పేరు మార్పుకు ఏదైనా లింక్ ఉందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 📢✨🇮🇳











































