top of page

🎥 నిర్మాత‌ల‌కే పైర‌సీ సైట్ రివ‌ర్స్ వార్నింగ్!

సినిమాని పైర‌సీ భూతం ఎలా ప‌ట్టి పీడిస్తుందో చూస్తునే ఉన్నాం. 🤖👀రిలీజ్ అయిన సినిమా గంట‌లోనే పైరసీకి గుర‌వుతుంది. కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండ పైర‌సీ బారిన ప‌డుతుంది. 🎬🚫ఇది ఇప్ప‌టి నుంచి కాదు చాలా కాలంగా కొన‌సాగుతుంది.

ree

సినిమాని పైర‌సీ భూతం ఎలా ప‌ట్టి పీడిస్తుందో చూస్తునే ఉన్నాం. 🤖👀రిలీజ్ అయిన సినిమా గంట‌లోనే పైరసీకి గుర‌వుతుంది. కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండ పైర‌సీ బారిన ప‌డుతుంది. 🎬🚫ఇది ఇప్ప‌టి నుంచి కాదు చాలా కాలంగా కొన‌సాగుతుంది. దీనిపై సినిమాటోగ్ర‌ఫీ శాఖ ప్ర‌త్యేక చ‌ట్టాలు తెచ్చినా పైర‌సీని అంతం చేయ‌డం మాత్రం సాధ్య ప‌డ‌లేదు. మూవీరూల్జ్‌, తమిళ్‌ రాకర్స్‌, ఫిల్మీ వ్యాప్ లాంటి సైట్లు ఇప్ప‌టికే రాజ్య‌మేలుతున్నాయి. అలాగే 'ఐబొమ్మ' కూడా కొంత‌ కాలంగా అంత‌కు మించి బెస్ట్ క్వాలిటీ అందించి నిర్మాత‌ల‌కు స‌వాల్ గా మారింది. 🎞️ఐ బొమ్మ హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ లుంటాయి. అందులో డౌన్ లోడ్ చేసుకునే వెసులు బాటు కూడా ఉంటుంది. ఎలాంటి సినిమా అయినా ఐబోమ్మ‌లో రిలీజ్ అనంత‌రం క‌నిపిస్తుంది. మ‌రి ఇది నిర్మాత‌ల‌కు తెలియ‌దంటారా? వాళ్ల‌కు తెలుసు. 🤔🕵️‍♂️కానీ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితులు. వాళ్ల సినిమా ఎక్క‌డ నుంచి ఐ బొమ్మ‌లోకి వ‌చ్చిందో ? 🎬వాళ్ల‌కే అర్దం కాదు. 🙅‍♂️ఆరేంజ్ లో ఇంట‌ర్నెట్ లో పైర‌సీ జ‌రుగుతుంది. తాజాగా ఐబొమ్మ షాడో లాంటి మ‌రో సైట్ ఏకంగా నిర్మాత‌ల‌కే వార్నింగ్ ఇచ్చింది. హెచ్చరిక జారీ చేస్తూ ఓ నోట్ నే రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం ఆ నోట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆ నోట్ లో ఏముందంటే? ఐ బొమ్మ మీద ఫోక‌స్ చేస్తే మేం ఎక్క‌డ దెబ్బ కొట్టాలో అక్క‌డ కొడ‌తాం.

 
 
bottom of page