పవన్ జర్నీపై అకీరా స్పెషల్ వీడియో.. చూస్తే గూస్‌బంప్స్ పక్కా
- MediaFx
- Jun 6, 2024
- 1 min read
జనసేన అధినేత పవన్ కల్యాణ్ AP ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మూవీ జర్నీపై తన కుమారుడు అకిరా నందన్ ప్రత్యేకంగా ఎడిట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
అకిరా తన తండ్రి కోసం స్వయంగా ఈ వీడియోను ఎడిట్ చేశాడని రేణు తెలిపారు. ‘‘నా లిటిల్ బాయ్‌కు వాళ్ల నాన్న అంటే అమితమైన ప్రేమ, తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనం’’ అని ఆమె క్యాప్షన్ పెట్టారు.
అకిరా ఈ వీడియోలో ఖుషి నుండి మొన్నటి భీమ్లా నాయక్ వరకు పవన్ కల్యాణ్ నటించిన సినిమాల డైలాగ్స్ మరియు సన్నివేశాలను అద్భుతంగా కలిపి ఎడిట్ చేశాడు. ఈ వీడియో చూసి పవన్ అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు. పవన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అకిరా ఈ వీడియో ఎడిట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.