రాఘవ లారెన్స్ కాంచన సీక్వెల్ సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం 🎬
- MediaFx
- Jun 6, 2024
- 1 min read
కోలీవుడ్ సినిమా సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన ఫ్రాంచైజ్ "కాంచన" (ముని)లో రాఘవ లారెన్స్ హీరోగా, తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించే హారర్ కామెడీ చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి. హారర్, కామెడీ జానర్‌లో మంచి ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్, అన్ని సినిమాలు భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌లో కొత్త సీక్వెల్ గురించి కూడా హింట్ ఇచ్చాడు.
తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త సీక్వెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను కూడా లారెన్స్ నే దర్శకత్వం వహించనుండగా, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే ప్రణాళికలు ఉన్నాయట. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.