top of page

మరోసారి అస్వస్థతకు గురైన బలగం మొగిలయ్య..

ree

నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా మంచి విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చివరిలో వచ్చే పాట ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. ఆ పాటను అద్భుతంగా ఆలాపించిన వారు బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు.

మొగిలయ్యకు కిడ్నీ, గుండె సంబంధింత వ్యాధులున్నాయి. కొన్ని నెలల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మెగాస్టార్‌ చిరంజీవి మొగిలయ్య చికిత్సకు సాయం చేశారు. ఇప్పుడు ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించడం కోసం వరంగల్‌లోని సంరక్ష అనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొగిలయ్యకు కరోనా సమయంలో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వైద్యం ఖర్చు ఎక్కువకావడంతో మొగిలయ్య దంపతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన భార్య ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.



 
 
bottom of page