OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్..🎥🎭
- Suresh D
- Aug 11, 2023
- 1 min read
భారీ బడ్జెట్‌తో రామాయణం ఇతివృత్తంగా వచ్చిన 'ఆదిపురుష్' సినిమా మొత్తానికి ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా కనిపించారు. భారీ అంచాలతో జూన్‌లో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే తాజాగా ఎలాంటి న్యూస్ లేకుండా సైలెంట్‌గా ఈ సినిమాను ఓటీటీలోకి దించేశారు.ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆదిపురుష్ ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది. అయితే హిందీ వెర్షన్‌కి సంబంధించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు.🌟🎬
