టెక్సాస్లో పర్యాటకులపై సొర దాడి!
- Jawahar Badepally

- Jul 5, 2024
- 1 min read

జూలై నాలుగవ తేదీన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవుదినం కావడంతో టెక్సాస్లోని సౌత్ పాడ్రే ఐలాండ్కి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. సముద్రంలో సేదతీరుతూ సందడిగా గడుపుతున్నవారిలో కొందరికి భయానక పరిస్థితి ఎదురైంది. ఒక సొరచేప సముద్రంలో ఈత కొడుతున్న ముగ్గురిపై దాడి చేసింది. అందులో ఒకరి కాలిని సొర కొరికినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో వైరలవుతోంది.











































