📢 హైదరాబాద్‌లో ఉద్రిక్తత: నిరుద్యోగుల ఆందోళనలో బర్రెలక్క అరెస్ట్
- Jawahar Badepally

- Jul 5, 2024
- 1 min read
హైదరాబాద్‌లో నిరుద్యోగుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. నాంపల్లిలోని TGPSC కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బర్రెలక్క (శిరీష)ను పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే తనను అరెస్టు చేయడమేంటని బర్రెలక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి డౌన్.. డౌన్.." అంటూ నినాదాలు చేస్తూ, తెలంగాణలో రౌడీ రాజకీయం జరుగుతుందని, సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.











































