top of page

‘తెలుగులో ఆ ఇద్దరు హీరోస్ అంటే చాలా ఇష్టం’.. క్రికెటర్ షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తాజాగా టిమిండియా క్రికెటర్ షమి కూడా తెలుగు హీరోలకు వీరాభిమాని అన్న విషయం తెలిసిపోయింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ షమీ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ.. ఇక్కడి నటీనటుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


సౌత్ లో మీకు ఇష్టమైన యాక్టర్స్ ఎవరని అడగ్గా.. షమీ మాట్లాడుతూ.. “నాకు సౌత్ ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం. నాకు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అంటే ఇష్టం” అని అన్నారు. “నేను ప్రాంతీయ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. నాకు సౌత్ మూవీస్ చాలా ఇష్టం. కానీ నాకు తమిళం, తెలుగు అర్థం కాదు..అందుకే డబ్బింగ్ సినిమాలు చూసేందుకు బాగుంటాయి” అని అన్నాడు. ప్రస్తుతం షమీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


 
 
bottom of page