రైతుబంధు ఆపి ఉద్యోగులకు జీతాలిస్తారా?: హరీశ్ 🌾
- Shiva YT
- Mar 8, 2024
- 1 min read
Updated: Mar 9, 2024
రైతుబంధు విషయంలో రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు రైతుబంధు ఆపి, ఏసీ రూముల్లో కూర్చున్న ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కరోనా కాలంలోనూ కేసీఆర్ రైతుబంధు డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలు ఆపి.. అన్నదాతలకు పెద్దపీట వేశామని చెప్పారు. 🌱💼








































