వాహనదారులూ ఇది మీకోసమే! 🚗
- Shiva YT
- Mar 8, 2024
- 1 min read
Updated: Mar 9, 2024
వేసవి మొదలవడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. వెహికిల్లోని టైర్లలో సరైన మోతాదులో గాలి లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని సైబరాబాద్ పోలీసులు ఓ ఫొటోను షేర్ చేశారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో టైర్లు పేలిపోయే అవకాశం ఉందని, వాహనాన్ని నడిపే సమయంలో టైర్లలో గాలిని చెక్ చేయాలని సూచిస్తున్నారు. 🌬️🚦











































