ఇందిరా గాంధీ ని దించేసిన మనం మోడీ కి ఎందుకు భయపడుతున్నాం
- Suresh D
- Mar 29, 2024
- 1 min read
1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ నియంతృత్వ ధోరణి పై వ్యతిరేకత తో ప్రజలు పార్టీ చూడలేదు, అభ్యర్ధి ని చూడలేదు, ప్రధాన మంత్రి అభ్యర్ధి ఎవరని పట్టించుకోలేదు… కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పైన ఎవరు పోటీ చేస్తే వారిని గెలిపించేసారు, జార్జి ఫర్నాండిస్ వంటి కొందరు నేతలు జైలు లో ఉంటూ కూడా ఎన్నికయ్యారు. ఎన్నికలకు వెళ్ళే సమయానికి కాంగ్రెస్ కి లోక్సభ లో 360 ఎంపీలు ఉంటే, ఎన్నిక తర్వాత 154 మాత్రమే గెలిచారు. కొన్ని ఎన్నికలు ప్రజలకు పాలకులకు మధ్యనే ఉంటాయి, ప్రతిపక్ష అభ్యర్ధులు కేవలం కార్యసాధనకు వాడే పరికరాలు మాత్రమే అనుకోవడానికి ఇదోక మంచి ఉదాహరణ. జైలు అయినా బయట అయినా.. పోరాటం చేశారు ఇందిర మీద.. మరిప్పుడు..45yrs ఇండస్ట్రీ cbn, మమత, నితీష్, నవీన్, శరద్ పవార్, kcr.... పోరాటం ఏది? సొంత పార్టీలని కాపాడుకునే పనిలో.. లేకుంటే ed, cbi, it










































