అసలు మనది ప్రజాస్వామ్యం దేశమేనా…
- Suresh D
- Mar 29, 2024
- 1 min read
సాక్షాత్తు కేంద్ర ఆర్ధిక మంత్రి గారే తన వద్ద పోటీ చేయడానికి కావలసిన ధనం లేదన్నప్పుడు, నాకు అనిపించింది… అసలు మన ప్రజాస్వామ్యం లో చట్టసభల్లో ప్రవేశించడానికి ధనిక వర్గం తప్ప పేద, మధ్యతరగతి వర్గాలు నోచుకోలేదా అని. అది సంపూర్ణమైన ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల కోసం వ్యయ పరిమితిని ₹95 లక్షలు అసెంబ్లీ ఎన్నికల కోసం ₹40 లక్షలు గా నిర్ణయించినప్పుడు, వందల కోట్లు అభ్యర్దులు ఖర్చు చేస్తుంటే అదే సంఘం ఎందుకు సరైన నిఘా పెట్టి అభర్ధులను నియంత్రించి కఠిన చర్యలు తీసుకోవడం లేదు?