top of page

IPL 2023: థర్డ్ అంపైర్ తప్పు చేశాడా? రోహిత్ శర్మ అవుటా? నాటౌటా? నిబంధనలు ఏం చెబుతున్నాయి...

ఐపీఎల్ లో అంపైరింగ్ తప్పిదాల గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా రోహిత్ శర్మ అవుట్ విషయంలో మరోసారి అదే జరిగింది.

రోహిత్ శర్మ అవుట్ పై ఐపీఎల్ లో మరోసారి వివాదం నెలకొంది. హనరంగ బౌలింగ్ లో ఫ్రంట్ ఫూట్ కి వచ్చిన రోహిత్ శర్మ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే అది కాస్త ప్యాడ్ కి తగిలింది. వెంటనే హనరంగ అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. రోహిత్ శర్మ చాలా దూరం క్రీజు ముందుకు రావడంతో హనరంగ రివ్యూకు వెళ్లాలనుకోలేదు. అయితే ఆర్సీబీ కెప్టెన్ డుప్లేసిస్ మాత్రం రివ్యూ తీసుకున్నాడు.అయితే థర్డ్ అంపైర్ ఇక్కడ పప్పులో కాలేశాడు. రోహిత్ శర్మ ఎంత ఫ్రంట్ కి వచ్చాడో చూడకుండా కేవలం డీఆర్ఎస్తో గుడ్డిగా డిసిషన్ ఇచ్చాడు. బాల్ ట్రాకింగ్ నేరుగా వికెట్లను తాకుతుండడంతో అవుట్ ఇచ్చాడు.దీంతో రోహిత్ శర్మకు ఏం జరిగిందో అర్థంకాలేదు.. నిబంధనల ప్రకారం 3మీటర్ల కంటే వికెట్ల ముందుకు వస్తే అది ఎల్బీడబ్యూ ఇచ్చే అవకాశం లేదు. కానీ థర్ట్ అంపైర్ మాత్రం దాన్ని అవుట్ ఇచ్చాడు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page