వరదలో కొట్టుకొచ్చిన చిన్నారి మృతదేహం
- Sudheer Kumar Bitlugu
- Apr 29, 2023
- 1 min read
సికింద్రాబాద్ కళాసిగూడ వద్ద నాలా ఫుట్పాత్ పైకప్పు నుంచి జారి పడి మౌనిక (6) మృతిచెందింది. ప్రాథమిక విద్య చదువుతున్న మౌనిక ఈరోజు ఉదయం కిరాణా వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా వర్షానికి నాలా పైభాగంలో రంధ్రం పడి నాలాలో పడిపోయి చనిపోయింది. వరద నీటిలో మృతదేహం కొట్టుకురావడంతో డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితేశారు. GHMC అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.