top of page

అనసూయకు మండిపోయేలా హరీష్‌ శంకర్ ట్వీట్..

విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా నెట్టింట్లో సందడి కనిపిస్తోంది. విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు ట్విట్టర్‌లో హంగామా చేస్తున్నారు. హరీష్‌ శంకర్ తాజాగా వేసిన ట్వీట్ చూస్తుంటే.. అనసూయకు మండిపోయేలా చేసినట్టుగా కనిపిస్తోంది.

Vijay Devarakonda Birthday : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో హంగామా కనిపిస్తోంది. రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్నారు. ఇక నేడు ఈయన బర్త్ డే సందర్భంగా ఖుషి సినిమాలోని మొదటి సాంగ్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అనసూయకు ఈ మధ్య జరిగిన వివాదం గురించి తెలిసిందే. మామూలుగానే అనసూయ, విజయ్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుంది. విజయ్ ఫ్యాన్స్‌ ఎప్పుడూ ఆమె మీద ఓ కన్నేసి ఉంచుతారు.


ది విజయ్ దేవరకొండ అని ఖుషి పోస్టర్‌లో ఉంది. దీంతో అనసూయ విజయ్‌ని పరోక్షంగా టార్గెట్ చేసింది. ఈ ది పైత్యం ఏంటో అంటూ కౌంటర్లు వేసింది. దీంతో అనసూయను విజయ్ ఫ్యాన్స్ ఆడేసుకున్నారు. విజయ్ అభిమానులు ఎంతగా రెచ్చిపోతుంటే.. అంతగా అనసూయ సైతం కౌంటర్లు వేస్తూ వచ్చింది. హీరోలు తమ అభిమానులను అదుపులో పెట్టుకోలేరా? అంటూ కౌంటర్లు వేసింది. నువ్ కూడా ఇలాంటి పిచ్చి ట్వీట్లు వేయడం, గెలకడం ఆపలేవా? అని విజయ్ ఫ్యాన్స్ సెటైర్లు వేశారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page