నేటి రాశి ఫలాలు: వీరికి భాగస్వామితో గొడవలకు ఆస్కారం🔍 🔮
- Suresh D
- Dec 20, 2023
- 2 min read
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే...🔍 🔮
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ప్రభుత్వ సంబంధ ఆదాయాలు పెరుగును. పుణ్యకేత్రములు దర్శించెదరు. గృహమున మంగళతోరణములు శుభప్రదమైన ఆనందదాయకమైన కలయికల వాతావరణం. అనవసర ఖర్చులు తగ్గించుకొనుట మంచిది. విఘ్నేశ్వరుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం శ్రేష్ఠం. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్చించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
వృషభరాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. రక్తప్రసరణ, అజీర్ణం, మూలవ్యాధుల సమస్యలు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం. అప్పుల బారినపడకుండా జాగ్రత్తపడాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి.
మిథున రాశి
మిథున రాశి జాతకులకు నేటి రాశి ఫలాలు మధ్యస్తంగా ఉన్నాయి. మీ భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చనప్పుడు హాస్యం, యుక్తి మర్యాద ఉపయోగిస్తే మీకు మరియు తోటివారికి ఉపశమనము కల్గి ఉద్రిక్త తలకు దారితీయకుండా ఉంటుంది. జ్ఞానవృద్ధి, వ్యాపార ప్రయోజనాలను పొందుతారు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సామాజిక విషయాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ స్థానం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. వేంకటేశ్వరస్వామిని పూజించాలి. వేంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. కీర్తి లభించును. కుటుంబంలో ఆనందం. జీవిత భాగస్వామి మరియు పిల్లలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తు, వస్త్రాల ప్రాప్తి. కుటుంబ సభ్యులతో వినోదాలలో పాల్గొంటారు. ఆభరణాల కొనుగోలు కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు గౌరవిస్తారు. కుటుంబముతో పుణ్య క్షేత దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగును. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మీకు అనుకూలంగా ఉంది. వినోదం మరియు వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది. ఆర్ధికంగా లాభదాయకం. సమాజంలో అరుదైన గౌరవం కలుగుతుంది. పోటీలలో విజయం సాధిస్తారు. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు మీకు మీకు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నూతన వస్తు, వస్త ప్రాప్తి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. నిద్రలేమి, మానసిక ప్రశాంతత లేకపోవుట. ఖర్చులు అధికమగును. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇతర దేశాలలో ఉన్న మీ పిల్లల నుండి శుభవార్తలు వింటారు. అన్నింటా విజయం సాధిస్తారు. అనుకూలమైన సమయం. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు కష్ట సమయం. ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. విద్యార్థులకు అనుకూలం. విజయం లభిస్తుంది. ఆరోగ్య విషయాలయందు, కుటుంబ విషయాలయందు ఆచితూచి వ్యవహరించాలి. వేంకటేశ్వరస్వామిని పూజించాలి. వేంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.