‘ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు రంగం సిద్ధం🏏
- Shiva YT
- Mar 17, 2024
- 1 min read
Updated: Mar 18, 2024
‘ఐపీఎల్ 2024 తొలి షెడ్యూల్ వచ్చేసింది. కానీ, మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారు. 📅 రెండవ సగం భారతదేశం వెలుపల నిర్వహిస్తారా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. 🤔 దీని గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.’
‘ఏడు దశల లోక్‌సభ ఎన్నికల కారణంగా IPL 2024 ద్వితీయార్ధం UAEలో జరుగుతుందని పుకార్లు వచ్చాయి. 🇦🇪 తమ పాస్‌పోర్ట్‌లను సంబంధిత ఫ్రాంచైజీలకు సమర్పించాలని ఆటగాళ్లను కోరినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 📢 కానీ, ధుమాల్ ఈ నివేదికలను పూర్తిగా తిరస్కరించారు.’
‘IPL 2024 మొదటి రెండు వారాల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 22న స్వదేశంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.’
‘ఐపీఎల్ మొత్తం భారత్‌లోనే ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా కూడా గతంలోనే స్పష్టం చేశారు. గత 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగినట్లే ఎన్నికల తేదీల ప్రకటన కోసమే బీసీసీఐ ఎదురుచూస్తోంది. అయితే, 2014లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లీగ్‌ని దేశం నుంచి తరలించారు. ఆ తర్వాత యూఏఈలో తొలి అర్ధభాగం, భారత్‌లో రెండో దశ మ్యాచ్‌లు జరిగాయి. ఈసారి అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే జరగాలని భావిస్తున్నారు.’