top of page

రేపు మేడారం జాతర ప్రారంభం 🙏 ..వన జాతరకు తరలివెళ్తున్న జనం.. 🎉

మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు అసన్నమవుతున్నాయి. 🌞 ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి. 🚶‍♂️ వనం జనంతో నిండిపోతోంది. 🌳 ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది.

మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు అసన్నమవుతున్నాయి. 🌞 ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి. 🚶‍♂️ వనం జనంతో నిండిపోతోంది. 🌳 ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. 🎊 మేడారం జనగుడారంగా మారి పోయింది. 🏞️ భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘ శుద్ధ మంచి ఘడియలు వచ్చేశాయి. 🕰️ ఆదివాసీ ఆచార సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబయింది. 🌿

వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం కీకారణ్యంలో ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. 🚗 ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. 🗓️ మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు. 🎇 ఇక 22వ తేదీన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. 🌺 శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 🌼 శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. 🌲 ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. 🌳 సమ్మక్క, సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. 🎆

ఈసారి జాతరకు అన్నీ తానై ఏర్పాట్లు చేశారు స్థానిక మంత్రి, ఆదివాసీ బిడ్డ సీతక్క. 🏞️ ఉచిత బస్సు పథకం తర్వాత పెద్దఎత్తున మహిళలు జాతరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని, వాళ్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చెప్పారు. 🚍 వన దేవతల జాతరకు జనం తరలి వెళుతున్నారు. 🌳 ఇప్పుడు జనంతో వనం నిండిపోయింది. 🌲

వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్సు నిలయంలో మేడారం వెళ్లే భక్తులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. 🚓 మహా జాతర నేపథ్యంలో భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. 📢 చిన్నపిల్లలు, ఆభరణాలు,డబ్బు వంటి విలువైన వస్తువుల సంరక్షణతో పాటు ప్రధానంగా భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు. 🧸 లక్షలాదిమంది తరలివచ్చే మేడారం జాతరకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మేడారానికి వెళ్లే భక్తులకు ఈ సందర్భంగా పోలీసులు , ఆర్టీసీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. 🚔

 
 
bottom of page