top of page

డిసెంబర్‌ 28 నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ..

ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.

ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు నమూనాలను సిద్ధం చేసింది. మహాలక్ష్మీ పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. మిగతా గ్యారంటీల అమలు ప్రక్రియ కోసం దరఖాస్తులను స్వీకరించనుంది.  ఈ ఆరు గ్యారంటీల స్కీమ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 28నుంచి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పిన ఆయన.. అన్ని గ్రామాల్లో అవసరమైన అప్లికేషన్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డును అర్హతను ప్రామాణికంగా నిర్దేశించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

 
 
bottom of page