తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారు..
- MediaFx
- Jul 29, 2024
- 1 min read
వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా.. తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా అంటూ వైసీపీ ప్రశ్నించింది. మీకన్నా.. పిరికివాళ్లు, స్థిరత్వం లేనివాళ్లు, అహంకారులు, స్వార్థపరులు ఎవరైనా ఉంటారా.. ఇంతకీ మీరు పోస్టుచేసిన ట్వీట్ చంద్రబాబు దగ్గరనుంచి వచ్చిందా.. లేదా ఆయన ఏజెంట్ నుంచి వచ్చిందా అంటూ వైఎస్ షర్మిలను వైసీపీ ప్రశ్నించింది. అంతకుముందు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే అసెంబ్లీకి వస్తామనడం వైఎస్ జగన్ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ఇంతకు మించిన పిరికితనం, అహంకారం ఎక్కడా కనపడవంటూనే.. అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా మోసం చేయడం మీకే చెల్లిందంటూ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని.. మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లకపోతే వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.