‘మత్తు’పై యుద్ధం చేద్దాం..ప్రధాని మోదీ
- MediaFx

- Jul 29, 2024
- 1 min read
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిస్తున్నారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్‌లో భాగంగా డ్రగ్స్ నిర్మూలనపై మాట్లాడారు. మత్తు మహమ్మారిని నిర్మూలించేందుకు మానస్ హెల్ప్ లైన్ వినయోగించుకోవాలని దేశ ప్రజలను కోరారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం గురించి ఎవరైనా సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు చెప్పాలని రిక్వెస్ట్ చేశారు. భారతదేశాన్ని డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా మార్చే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పాల్గొనాలని కోరారు. డ్రగ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, చదువు, ఉద్యోగం సమాజంపైన ప్రభావం చూపుతుంది. జీవితంలో అతిపెద్ద నష్టాన్ని మిగుల్చుతుంది. అందుకే, మానస్ హెల్ప్‌లైన్‌ను ఉపయోగించుకోవాలని చెబుతున్నారు ప్రధాని మోదీ. 1933.. ఇదే మానస్ హెల్ప్‌లైన్. అసలేంటీ మానస్ హెల్ప్‌లైన్..? డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడదామనుకున్న వారికి సహాయకారిగా ఉంటుందీ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ సెంటర్. ఇందులో రీహాబిలిటేషన్ ఫెసిలిటీ కూడా అందిస్తారు. అంతేకాదు, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని, డ్రగ్స్ సరఫరాను నియంత్రించడానికి కూడా మానస్ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవచ్చు. డ్రగ్స్ నిర్మూలన కోసం భారత ప్రభుత్వం పెద్ద పోరాటమే చేస్తోంది. కాని, మార్పు సమాజం నుంచి కూడా రావాలి. సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘మానస్’ హెల్ప్‌లైన్ తీసుకొచ్చినట్టు చెప్పారు ప్రధాని మోదీ.












































