‘విరాట్ కోహ్లి కొట్టినట్టు.. తెలంగాణలో బీఆర్‌ఎస్ కూడా సెంచరీ కొడుతుంది’ 🏏💙
- Shiva YT
- Nov 16, 2023
- 1 min read
విరాట్ కోహ్లి కొట్టినట్టు తెలంగాణలో బీఆర్‌ఎస్ సెంచరీ కొడుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు.

BRS గెలుపు కోసం పార్టీ సర్పంచులు, MPTCలు, కార్యకర్తలు తమ తమ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని KTR అన్నారు. కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తమని ఆరోపించారు. తాను పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లిలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. గడిచిన 15 ఏళ్లుగా సిరిసిల్లను తాను చేతనైంత అభివృద్ధి చేసానని, మరోసారి అవకాశం ఇస్తే మరింత మంచి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. 🗳️🎤