top of page

🗣️🇮🇳 ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు సంచులతో వస్తున్నాయన్నారు..

జనంలో లేని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నేతలు సంక్రాంతి గంగిరెద్దుల మాదిరిగా వస్తున్నారనీ విమర్శించారు.

కాంగ్రెస్ కు ఓటేస్తే ముఖ్యమంత్రి ఎవరో తెలియదనీ, సీల్డ్ కవర్ సీఎం తెలంగాణకు అవసరం లేదని ధ్వజమెత్తారు. తాజా మాజీ మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ అసలే అక్కర లేదనీ చెప్పారు. కాంగ్రెస్‌కు కర్నాటక నుంచి డబ్బులు వస్తున్నాయన్నారు కేటీఆర్‌. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈసారి గర్వభంగం తప్పదన్నారు. డబ్బు మదంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ మాట్లాడుతున్నారని, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య గెలవడం ఖాయమన్నారు.

అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. డబ్బు సంచులతో మిడిసి పడుతున్నారనీ, డబ్బు మద్యం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో మూడు గంటల కరెంటు చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటుండని అన్నారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ఆలోచించుకుని ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు టీవీ వేదికల్లో కొట్టుకుంటున్నారని, మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమై పోయిందన్నారు. మరోసారి కేసీఆర్ గెలిస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుందని కేటీఆర్ చెప్పారు. 🗳️💬


 
 
bottom of page