top of page

📱 ఐఫోన్ లవర్స్‌కు స్టన్నింగ్ అప్‌డేట్..

📸 కెమెరా బటన్.. టిమ్ కుక్ నేతృత్వంలోని ఆపిల్ సంస్థ రాబోయే ఐఫోన్ 16 ప్రోటోటైప్‌లపై కొత్త బటన్‌ తీసుకురానున్నట్లు సమాచారం. పరికరాన్ని అడ్డంగా పట్టుకుని ప్రజలు త్వరగా చిత్రాలు, వీడియోలను తీయడంలో ఈ బటన్ సహాయపడుతుంది. ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. కెమెరా బటన్ ఫోన్‌కు కుడి దిగువన ఉండవచ్చని, అంటే ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫొటోలు, వీడియోలను తీసేటప్పుడు అది నేరుగా చూపుడు వేలు కింద ఉంటుందని పేర్కొంది. 📷🎥

ree

🔘 యాక్షన్ బటన్ స్థానంలో.. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఐఫోన్ 15 సిరీస్ లో కనిపించే మ్యూట్ బటన్‌ను భర్తీ చేస్తూ కొత్త యాక్షన్ బటన్‌తో వచ్చింది. ఐఫోన్ 15 సిరీస్ మార్కెటింగ్ ప్రచారంలో యాక్షన్ బటన్ కీలక భాగం. అదేవిధంగా వచ్చే కొత్త తరం ఫోన్లలో కొత్త కెమెరా బటన్ ఆపిల్‌కు కీలకమైన విక్రయ కేంద్రంగా ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. 📱📸

🔍 మాక్రూమోర్స్ అనే సంస్థ తన సెప్టెంబర్ నివేదికలో ఇదే విషయన్నా చెప్పింది. ఐఫోన్ 16 సిరీస్‌లో “ప్రాజెక్ట్ నోవా” అనే సంకేతనామం గల మరొక కెపాసిటివ్ బటన్ ఉండవచ్చని సూచించింది. కొత్త కెమెరా బటన్ మెకానికల్‌కు బదులుగా కెపాసిటివ్ బటన్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 📷

 
 
bottom of page