top of page

ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ఫోన్‌..ధర కూడా తక్కువే 📱

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 🚀 ఇన్‌ఫినిక్స్‌ జీరో 30 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చారు. 👏 ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన తొలి సేల్‌ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 🗓️

ree

రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. 🔢 ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999 కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999 గా ఉంది. 💰 లాంచింగ్ ఆఫర్‌ కింద పలు బ్యాంక్‌ల కార్డులపై డిస్కౌంట్‌ అందించనున్నారు. 💳 ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే:

6.78 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే

2,400x1,080 పిక్సెల్‌తో కూడిన కర్వ్డ్ డిస్‌ప్లే

144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను ప్రత్యేకంగా అందించారు. 📺

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే

మీడియాటెక్‌ డైమెన్సిటీ 8020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ 🔄

బ్యాటరీలో 68 వాట్స్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ 🔋

ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా: 108 మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరా, 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరా సెటప్‌

సెల్ఫీల విషయానికొస్తే 50 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరా అందించారు. 📸


 
 
bottom of page