top of page

సిద్దార్థ్‌ మల్హోత్రతో శ్రీలీల రొమాన్స్‌..!


ఒకానొక దశలో శ్రీలీల నటించిన సినిమా శుక్రవారానికి ఒకటి విడుదలయ్యేది. అసలు ఈ అమ్మాయి ఇన్ని సినిమాలకు డేట్స్‌ ఎలా ఇస్తుంది? అనే విషయంపై ఫిల్మ్‌ వర్గాల్లో చర్చలు ఓ రేంజ్‌లో జరిగాయి. అయితే.. అన్ని సినిమాలు చేసినా విజయాలు మాత్రం అరాకొరే. ధమాకా, భగవంత్‌ కేసరి సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ విజయాలు ఈ ముద్దుగుమ్మకు రాలేదనే చెప్పాలి. అందుకే.. రాశి కంటే వాసి ముఖ్యమని భావిస్తున్నది శ్రీలీల. అవకాశాలు వస్తున్నా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే పనిలో ఉంది. తాజాగా ఓ అగ్ర హీరో సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కోసం శ్రీలీలను కలిస్తే సున్నితంగా తిరస్కరించిందని ఫిల్మ్‌ వర్గాల టాక్‌. ఇదిలావుంటే.. ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాలు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, ఆర్‌టీ 75. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కూడా శ్రీలీల పేరే ఎక్కువ వినిపిస్తున్నది. ఇదిలావుంటే.. బాలీవుడ్‌లో సిద్దార్థ్‌ మల్హోత్ర కథానాయకుడిగా నటిస్తున్న ‘మిట్టి’ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. కథాగమనంలో తన పాత్ర కీలకంగా ఉండటంతో శ్రీలీల ఈ సినిమాకు వెంటనే అంగీకరించిందని తెలిసింది. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రారంభం కానున్నదట. వీటితోపాటు తమిళంలో కూడా రెండు సినిమాలకు ఈ అందాలభామ సంకతం చేసినట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనా.. దూకుడు తగ్గించి, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న ఈ తెలుగమ్మాయికి ఇకనైనా విజయాలు పలకరిస్తాయో లేదో చూడాలి.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page