తండ్రైన హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్
- MediaFx
- Aug 24, 2024
- 1 min read
హాలీవుడ్ స్టార్ పాప్ సింగర్ జస్టిన్ జస్టిన్ బీబర్ (Justin Bieber) తండ్రయ్యాడు. జస్టిన్ బీబర్ భార్య, మోడల్ హేలీ బీబర్ (Hailey Bieber) శనివారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జస్టిన్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ”వెల్కమ్ హోమ్ జాక్ బ్లూస్ బీబర్” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఇక తన కొడుకుకు జాక్ బ్లూస్ బీబర్(Jack Blues Bieber) అని నామకరణం చేసినట్లు ప్రకటించారు. స్టార్ సింగర్ సెలెనా గోమెజ్(selena gomez)తో విడిపోయిన అనంతరం హేలీ బీబర్‌ను పెళ్లి చేసుకున్నాడు జస్టిన్. 2018లో పెళ్లి చేసుకోగా.. ఆరు సంవత్సరాల తర్వాత పేరెంట్స్ అయ్యారు ఈ జంట. 2010లో వచ్చిన మై వరల్డ్ ఆల్బమ్‌లోని బేబీ సాంగ్‌తో ఫుల్ పాపులర్ అయ్యాడు జస్టిన్. ఈ పాట అప్పట్లో ప్రపంచంలో సగం మందికి పైగా విన్నట్లు రికార్డు కూడా సృష్టించింది. ఇటీవల అంబానీ పెళ్ళిలో జస్టిన్ తన పాటలతో ఆకట్టుకున్నాడు. ఈ ఈవెంట్ కోసం జస్టిన్ ఏకంగా రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.