బెంగాలీ నటి పాయల్‌ను వేధించిన బైకర్..
- MediaFx
- Aug 24, 2024
- 1 min read
వైద్యురాలి హత్యాచార ఘటనతో కోల్‌కతా తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో మరో వేధింపు ఘటన చోటుచేసుకున్నది. బెంగాలీ నటి పాయల్ ముఖర్జీ(Payel Mukherjee)ని.. ఓ బైకర్ వేధించాడు. కారులో వెళ్తున్న ఆమెను ఓ వ్యక్తి వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి పాయల్.. ఫేస్‌బుక్ వీడియోలో తెలిపింది. సదరన్ అవెన్యూలో తన కారు ముందు ఆ బైకర్ అడ్డంగా నిలబడ్డాడని, కారు నుంచి బయటకు రావాలని బెదిరించాడని ఆమె చెప్పింది. భయపడి కారు నుంచి బయటకు రాలేదని, అయితే ఆ వ్యక్తి తన కుడివైపు ఉన్న అద్దాన్ని పగలగొట్టాడని, ఆ ఘటనలో తన చేతికి గాయమైనట్లు ఆమె తెలిపింది. స్థానిక ప్రజలను తనను రక్షించినట్లు పాయల్ పేర్కొన్నది. ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కూడా ఆమె వెల్లడించింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లోనే ఇలా ఓ మహిళను వేధిస్తే, అప్పుడు నిర్జన ప్రదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.