ప్రభాస్ గురించి అలా అనలేదు..బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి..💭🚫
- Suresh D
- Jul 27, 2023
- 1 min read
కావాలని ప్రభాస్ సినిమాలు ప్లాప్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారని రకరకాలుగా వార్తలు అయితే కొన్ని వచ్చాయి.ఇక బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. గతంలో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా విడుదల అయిన రోజే తన కాశ్మీరీ ఫైల్స్ విడుదల చేశారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కావాలని ప్రభాస్ సినిమాలు ప్లాప్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారని రకరకాలుగా వార్తలు అయితే కొన్ని వచ్చాయి.ఇక బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. గతంలో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా విడుదల అయిన రోజే తన కాశ్మీరీ ఫైల్స్ విడుదల చేశారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రాధేశ్యామ్ డిజాస్టర్ కావడం కూడా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా భాగా జనాల్లోకి వెళ్ళిందనే కామెంట్స్ కూడా వచ్చాయి.. ఇదిలా ఉంటే వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కరోనా సమయంలో వ్యాక్సిన్ పేరుతో జరిగిన దోపిడీపై ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు.ఇక ఈ మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతూ ఉండటం విశేషం. అదే రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా, వివేక్ కావాలనే ప్రభాస్ తో పోటీ పడుతున్నాడని, ఆరోజే తన సినిమాలు విడుదల చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన కావాలనే ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభాస్ చాలా పెద్ద స్టార్ అని, తనది చాలా చిన్న బడ్జెట్ సినిమా అని చెప్పారు. ప్రభాస్ తో పోటీపడాలనే కోరిక తనకు లేదని చెప్పారు. అంతేకాదు, ప్రభాస్ పై తనకు ఎలాంటి ద్వేషం కూడా లేదని చెప్పారు. ప్రభాస్ మూవీ విడుదల రోజే తన మూవీ విడుదల కావడం అనేది కో ఇన్సిడెన్స్ అని, కావాలని ప్లాన్ చేసింది కాదు అని చెప్పారు.🚫👥🗯️











































