బిగ్బాస్ షోకు సెన్సార్ లేకపోతే ఎలా..📝🏛️
- Suresh D
- Jul 27, 2023
- 1 min read
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ విషయంలో హైకోర్ట్ కీలక వ్యాఖయలు చేసితంది. టీవీల్లో అసభ్య, అభ్యంతరకర రీతిలో రియాల్టీ షోలు. ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ విషయంలో హైకోర్ట్ కీలక వ్యాఖయలు చేసితంది. టీవీల్లో అసభ్య, అభ్యంతరకర రీతిలో రియాల్టీ షోలు.. ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు రావడం అంటే పోస్టుమార్టం చేయడంలాంటిదని ఘాటుగా వ్యాఖ్యనించింది. ప్రస్తుతం ఈ షో ప్రసారం కావడం లేదనే కారణంగా ఈ విషయంపై న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండలేదని తెలిపింది. దీనిపై అటు కేంద్రానికి తగిన సూచనలు ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తామని వెల్లడించింది హైకోర్టు. పిల్లి మెడలో గంట కట్టేదేవరనేది ఇక్కడ ప్రధాన విషయమని వ్యాఖ్యనించింది. రియాల్టీ షోపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాటీవీ, ఎన్డేమోల్ ఇడియా ప్రైవేట్ లిమిటెడ్, బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్, సినీ హీరో అక్కినేని నాగార్జులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణన నాలుగు వారాలకు వాయిదా వేసింది. 🚫👥🗯️











































