top of page

సూర్య గ్రహణం అంటే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు కొట్లాటగా నమ్ముతారు 🌓🌞

భారతదేశంలో సూర్య గ్రహణం అంటే శుభప్రదంగా పరిగణించరు. అయితే అది మన దగ్గర మాత్రమే కాదు ఇతర దేశాల్లోనూ సూర్య గ్రహణం అశుభంగా భావిస్తారు. ఈ గ్రహణానికి సంబంధించి అనేక విచిత్రమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ఏంటో చూద్దామా..!

ree

గ్రహణాలకు జ్యోతిష్య, మత, శాస్త్రీయ ప్రాముఖ్యత చాలా ఉంది. మతపరంగా సూర్య, చంద్ర గ్రహణాలకు రాహుకేతువు కారణంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువులు నీడ గ్రహాలు. ఇవి చంద్రుడిని, సూర్యుడిని మింగడం వల్ల సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడుతుందని నమ్ముతారు. శాస్త్రీయంగా భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు ప్రయాణించినప్పుడు సూర్యరశ్మి భూమిని చేరదు. దీన్ని సూర్య గ్రహణం అంటారు. మత విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయాన్ని శుభప్రదంగా పరిగణించరు. భారతదేశంలో అయితే గ్రహణాల సమయంలో ఆలయాలు మూసేస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు తలపెట్టారు. దీన్నే సూతక్ కాలం అంటారు.

భారత్ లో మాత్రమే కాదు అమెరికా వంటి దేశాలలో కూడా గ్రహణానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు గ్రహణం అంటే పునర్జన్మగా భావిస్తే మరికొందరు గ్రహణ కాలం చెడుగా భావించి ఇంట్లో నుంచి బయటకే రారు. గ్రహణానికి సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన కథల గురించి తెలుసుకుందాం.🌞🌕

గ్రహణం భారీ కప్ప

ఉత్తర అమెరికాలోని నవజో ప్రాంత ప్రజలు గ్రహణాన్ని చూడటం అనేదాన్ని అశుభంగా భావిస్తారు. గ్రహణం భారీ కప్పలా ఉంటుందని, ఇది సూర్య భగవానుడిని మింగడానికి ప్రయత్నిస్తుందని కొందరు చెబుతారు. అదే సమయంలో మరికొందరు సూర్య గ్రహణాన్ని పునర్జన్మకి చిహ్నంగా భావిస్తారు. ఇలా రెండు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

అనారోగ్యానికి సంకేతం

మెక్సికోలో నివసించే ప్రజలు గ్రహణాన్ని అనారోగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఈ గ్రహణం చూస్తే అనారోగ్య సమస్యలు కలుగుతాయని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో బయటకి రారు.

బ్రెజిల్ ప్రజలు ఇళ్లలోనే ఉంటారు

బ్రెజిల్ లోని కొన్ని కమ్యూనిటీల ప్రజలు గ్రహణం దుష్ట శక్తులకు సంబంధించినదని నమ్ముతారు. దుష్టశక్తుల ఆగ్రహానికి గ్రహణం వస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ భయంతోనే ప్రజలు తమ పనులన్నీ మానుకుని ఇంటికి పరిమితమవుతారు. గ్రహణం కష్టాలు, దురదృష్టాన్ని తెస్తుందని భయపడతారు. మరొక కథ ప్రకారం గ్రహణం సమయంలో ప్రార్థన చేసి కొన్ని మూలికలు కాలిస్తే వృద్ధాప్య ప్రభావాలు నివారిస్తుందని నమ్ముతారు.

సూర్యుడు, చంద్రుడు కొట్లాట

పశ్చిమ ఆఫ్రికాలోని టోగో, బెనిన్ లోని ప్రజలు సూర్యుడు, చంద్రుడు కొట్లాడుకోవడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని నమ్ముతారు. దీంతో వాళ్ళు భయపడిపోయి సూర్య, చంద్రులు తమ విభేదాలు పరిష్కారం అవాలని, వారి పోరాటం ముగించమని వేడుకుంటూ పూజలు చేస్తారు.

కొరియన్ ప్రజల నమ్మకం ఇది

కొరియన్ జానపథ కథల ప్రకారం అతీంద్రియ శక్తులు కలిగిన కుక్కలు సూర్యుడిని దొంగిలించండానికి ప్రయత్నిస్తున్నాయని అందుకే సూర్య గ్రహణం సంభవిస్తుందని అంటారు. అందుకే సూర్య గ్రహణ సమయంలో అనేక సంస్కృతుల వాళ్ళు సంప్రదాయం ప్రకారం కుండలు, చిప్పలు పగలగొడుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారు. ఇలా పెద్ద శబ్ధం చేయడం వల్ల గ్రహణానికి కారణమైన రాక్షసుడు భయపడి పారిపోతారని నమ్ముతారు.

సూర్యుడు కోపంగా ఉన్నాడు

కాస్త విచిత్రంగా అనిపిస్తుంది గ్రీకుల నమ్మకం. గ్రహణం అంటే సూర్య దేవుడు తమ రాజు మీద కోపంగా ఉన్నాడని, ఆయన్ని శిక్షిస్తాడని నమ్ముతారు. అందుకే సూర్య భగవానుడి ఉగ్రత నుంచి రాజుని రక్షించుకోవడం కోసం ఆ సమయంలో ప్రత్యామ్నాయ వ్యక్తిని రాజుగా పెడతారు. గ్రహణం ముగిసిన తర్వాత మళ్ళీ రాజుకి తన బాధ్యతలు అప్పగిస్తారు.

 
 
bottom of page