‘పుష్ప2’ నుంచి షెకావత్ లుక్ రిలీజ్..🌟🎥
- Suresh D
- Aug 8, 2023
- 1 min read
‘పార్టీ లేదా పుష్ప’ అంటూ విలనిజాన్ని పండించాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’లో కనిపించేది కొద్దిసేపైనా గుర్తుండిపోయే పాత్ర చేశాడు.

‘పార్టీ లేదా పుష్ప’ అంటూ విలనిజాన్ని పండించాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’లో కనిపించేది కొద్దిసేపైనా గుర్తుండిపోయే పాత్ర చేశాడు. ‘పుష్ప2’లో హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.ఈ రోజు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ టీమ్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘పుష్ప ది రూల్’ నుంచి ఫహాద్ లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు.‘‘భన్వర్ సింగ్ షెకావత్ సర్.. ప్రతీకారంతో వస్తున్నారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నిన్నటిదాకా ‘అప్‌డేట్ లేదా పుష్ప’ అంటూ అడిగిన అభిమానులు.. ఇప్పుడు ‘పార్టీ లేదా షెకావత్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పుప్ప 2 ది రూల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 🌟🎥