జైలర్ .. శంకర్ ని పట్టుకోగలడా …?🎬
- Suresh D
- Aug 8, 2023
- 2 min read
ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్ ..వీళ్లిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్. ఖచ్చితంగా ఎవరి సినిమా గెలుస్తుంది. ఎవరిది పక్కన నిలబడుతుందనే చర్చ సహజంగా మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి చర్చే జైలర్ కు, భోళా శంకర్ కు మధ్య మొదలైంది. అవును ఆగష్టు 10 న జైలర్ , 11 న భోళాశంకర్ థియేటర్ బరిలోకి దిగనున్నాయి.

ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్ ..వీళ్లిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్. ఖచ్చితంగా ఎవరి సినిమా గెలుస్తుంది. ఎవరిది పక్కన నిలబడుతుందనే చర్చ సహజంగా మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి చర్చే జైలర్ కు, భోళా శంకర్ కు మధ్య మొదలైంది. అవును ఆగష్టు 10 న జైలర్ , 11 న భోళాశంకర్ థియేటర్ బరిలోకి దిగనున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో వింటేజ్ లుక్‌తో అదరగొట్టిన మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు కొల్లగొట్టారు. `ఆచార్య` ఫ్లాప్ తరువాత `వాల్తేరు వీరయ్య`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన చిరంజీవి సరికొత్త ఉత్సాహంతో యాక్షన్ డ్రామా `భోళా శంకర్` తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, ఏకె ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `వేదాలం` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ మూవీలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా, సిస్టర్‌గా కీలక పాత్రలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. పక్కా తెలంగాణ యాసలో చిరు తొలిసారి డైలాగ్‌లు చెప్పనున్న ఈ మూవీ తో మరో సారి చిరు పూనకాలు లోడింగ్ లాంటి పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేలా కనిపిస్తున్నాడు.
అయితే రజనీకాంత్ జైలర్ కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాలో త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని ట్రైలర్ ని బట్టి అర్థమవుతుంది.అయితే రజనీ సినిమాలు ఈ మద్యకాలంలో భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావట్లేదు. దర్బార్ , పెద్దన్న లాంటి డిజాస్టర్ మూవీస్ వెనుక వేసుకున్న రజిని ఈ సారి జైలర్ తొ రజిని మ్యానియా చూపించాలని చూస్తున్నాడు. ఈ మూవీ దర్శకుడు నెల్సన్ దిలీప్ గత చిత్రం భీస్ట్..రిలీజ్ కు ముందు పెద్ద సెన్సేషన్ ..కానీ రిలీజ్ అయ్యాక డిజాస్టర్. కాబట్టి ఈ సినిమా ట్రైలర్ లో ఉన్నట్లు ఇంటెన్స్ గా థ్రిల్లింగ్ గా ఉంటే పెద్ద హిట్టే..అప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా భోళా శంకర్ పై ప్రభావం చూపిస్తుంది . అలా కాకపోతే జైలర్ జనం అంతా భోళా శంకర్ థియేటర్ లో ప్రత్యక్షమవుతారు. మరి జైలర్ తో రజనీకాంత్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
మొత్తానికి ఈ వారం రెండు పెద్ద హీరోలు ఆడియన్స్ కి విందుభోజనం పెట్టడం కాయం లా కనిపిస్తుంది.