top of page

700 కోట్లు దాటిన జవాన్ కలెక్షన్స్..💫🎞️

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ పై తన దండయాత్రను కొనసాగిస్తున్నాడు. జవాన్ సినిమాతో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. తొమ్మిదో రోజు అయిన జవాన్ వసూళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ మూవీ రూ.700 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో రోజు రూ.21 కోట్లు నెట్ కలక్షన్స్ ను రాబట్టింది. అదే విధంగా ఈ మూవీకి రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. తక్కువ సమయంలోనే రూ.700 కోట్లను కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా జవాన్ చరిత్ర సృష్టించింది. 9వ రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.410.88 కోట్లు నెట్ కలెక్షన్స్, రూ.730 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేయగలిగింది.💫🎞️


 
 
bottom of page