top of page

🎬 షారుఖ్ ఖాన్ ‘జవాన్‌’లో దళపతి 🎬

🎥 షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ ‘జవాన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు.

ree

🎥 షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ మూవీ ‘జవాన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటించిన చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెంచేయగా.. తాజాగా మరొక అప్‌డేట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. ఈ చిత్రంలో దళపతి విజయ్ కేమియో రోల్‌లో కనిపిస్తారని ఎప్పటి నుంచో న్యూస్ వినిపిస్తోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదే క్రమంలో ‘జవాన్’ మూవీకి యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన యానిక్ బెన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన అసలు విషయాన్ని రివీల్ చేశాడు.‘జవాన్’ మూవీ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. అలాగే ఆగస్ట్ మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ ‘జవాన్’ మూవీలో గెస్ట్ రోల్ చేసినట్లు యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ వెల్లడించాడు. అట్లీతో విజయ్ ఇప్పటికే మూడు సినిమాలకు పనిచేయగా.. ఆ బాండింగ్‌తోనే ‘జవాన్‌’లో తనతో అతిథి పాత్ర చేయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడబోతున్నారనే విషయం తెలిసి షారుఖ్, విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 🌟😀🎉


 
 
bottom of page