top of page

శేఖర్ కమ్ముల మల్టీస్టారర్ ప్లాన్..🤩🎥

శేఖర్ కమ్ముల.. టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ టాలీవుడ్ డైరెక్టర్. ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు శేఖర్ కమ్ముల.

ree

శేఖర్ కమ్ముల.. టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ టాలీవుడ్ డైరెక్టర్. ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు శేఖర్ కమ్ముల. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. శేఖర్ కమ్ముల తో సినిమా కన్ఫర్మ్ అయిన తర్వాత ధనుష్ ఇతర సినిమాలతో బిజీ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. తమిళ్ లోనే కాదు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు ధనుష్. ఇక శేకర్ కమ్ముల ధనుష్ సినిమాను పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో మరో హీరోగా నటించనున్నారని టాక్. శేఖర్ కమ్ముల ఈ సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నారట. ఈ మూవీలో సెకండ్ హీరోగా కింగ్ నాగార్జున నటిస్తున్నారని తెలుస్తోంది.👉🏼🌟🎥


 
 
bottom of page