top of page

అడ్వాన్స్ బుకింగ్స్‏లో అదరగొడుతున్న ‘బ్రో’ మూవీ..🎟️🎬

💫🎟️ బాక్సాఫీస్ వద్ద బ్రో సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు.

ree

💫🎟️ బాక్సాఫీస్ వద్ద బ్రో సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 28న రిలీజ్ కానుంది.పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ముందుగానే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. ఇంకెముందు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్.. టికెట్స్ ఓపెన్ చేయగానే గంటలో బుక్ మై షో యాప్‏లో పదివేల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఓపెన్ చేసిన గంటలోనే ఏకంగా పదివేలకు పైగా టికెట్స్ సేల్ కావడంతో నిర్మాణ సంస్థతోపాటు అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.🎬💫🎟️

 
 
bottom of page