top of page

ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్.. మేకోవర్ మామూలుగా లేదట!🎬🎥

మారుతి దర్శకత్వంలో చేస్తున్నది పక్కా కమర్షియల్ మూవీ. ప్రభాస్ నుంచి తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాను ప్రస్తుతానికి ‘రాజా సాబ్’ అనే టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చాలా పెద్దదిగానే ఉంది. ఈనెల 22న ‘సలార్: పార్ట్ 1 - సీసిఫైర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ప్రభాస్.. ఆ తర్వాత వరుసగా వైవిధ్యమైన సినిమాలతో రాబోతున్నారు. ఆయన ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 3898 ఎడి’, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా సమాంతరంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవి కాకుండా ‘సలార్’ పార్ట్ 2, సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు కూడా రానున్నాయి. అయితే, వీటన్నింటిలో మారుతి దర్శకత్వంలో చేస్తున్నది పక్కా కమర్షియల్ మూవీ. ప్రభాస్ నుంచి తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.

ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాను ప్రస్తుతానికి ‘రాజా సాబ్’ అనే టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌లను హీరోయిన్లుగా తీసుకున్నారు. అలాగే సత్యరాజ్, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా భాగం కాబోతున్నారు. ఆయనకు లుక్ టెస్ట్ చేయడానికి నిన్న మారుతి, అతని స్నేహితుడు ఎస్కేఎన్ ముంబై వెళ్లారు. సంజయ్ దత్ కొత్త లుక్ అదిరిపోయిందట. ప్రభాస్ సినిమా కోసం ఆయన మేకోవర్ తెరపై ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు.

సంజయ్ దత్ చాలా ఏళ్లుగా బాలీవుడ్ సినిమాలకే పరిమితమైపోయారు. 1998లో నాగార్జున హీరోగా వచ్చిన తెలుగు సినిమా ‘చంద్రలేఖ’లో అతిథి పాత్రలో సంజయ్ దత్ మెరిశారు. కానీ, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ తెలుగులో కనిపించలేదు. అసలు ఆయన సౌత్ సినిమా వైపే చూడలేదు. కానీ, ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’తో సౌత్‌లో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు సంజయ్. ఈ సినిమాలో అధీరగా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాత్రతో సంజయ్ దత్ సౌత్‌లో నెగిటివ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమైంది. దీంతో ఆయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.🎬🎥




 
 
bottom of page